సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha health: నాగచైతన్య మాటేంటి?

ABN, First Publish Date - 2022-10-30T23:52:18+05:30

సమంత.. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సమస్య నుంచి కోలుకుంటానే నమ్మకం ఉందని శనివారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు సామ్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత..(Samantha Health) మయోసైటిస్‌ (myositis disease)అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సమస్య నుంచి కోలుకుంటానే నమ్మకం ఉందని శనివారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు సామ్‌. నిరంతరం యాక్టివ్‌గా కనిపించే సామ్‌ ఈ విషయాన్ని బయటపెట్టడం, కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుందని ఎమోషనల్‌గా పోస్ట్‌ చేయడంతో సినీతారలు, అభిమానులు సైతం షాక్‌కి గురయ్యారు. చిరంజీవి(Chiranjeevi), ఎన్టీఆర్‌, అఖిల్‌(Akhil), నాని, కృతీసనన్‌, రాశీఖన్నా(Raashi khanna), జెనీలియా, హన్సిక, నందినీరెడ్డి, వంశీపైడిపల్లి సహా సమంతతో పని చేసిన చాలామంది ఆమె త్వరగా కోలుకోవాలంటూ స్పందించారు. సమంతకు ధైర్యం చెబుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. సమంత మాజీ భర్త నాగచైతన్య సోదరుడు అఖిల్‌ కూడా సమంత ఆరోగ్యంపై స్పందించాడు. 

అయితే ఇప్పుడు మరో టాపిక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. నాగచైతన్య సమంత ఆరోగ్యంపై స్పందిస్తాడా? లేదా అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. చై–సామ్‌ ఇద్దరూ ‘ఏమాయా చేశావె’ చిత్రంతో పరిచయమయ్యారు. పరిచయం స్నేహంగా, తదుపరి ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. 2018లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంట గత ఏడాది అక్టోబర్‌లో క అండర్‌స్టాండింగ్‌తో విడిపోయినట్లు ప్రకటించారు. ప్రేమ, పెళ్లి కన్నా ముందు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. సామ్‌ను స్నేహితురాలిగా భావించి ఆమె ఆరోగ్యంపై చైతూ స్పందిస్తే బావుంటుంది అని నెటిజన్లు, అభిమానులు కోరుకుంటున్నారు.  మరి చైతూ స్పందిస్తాడా? లేదా అన్నది చూడాలి. 





Updated Date - 2022-10-30T23:52:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!