సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చిరు సెట్లో.. శ్రుతి

ABN, First Publish Date - 2022-04-20T06:51:12+05:30

చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వాల్తేరు శ్రీను’ అనే పేరు పరిశీలనలో ఉంది. చిరు సరసన శ్రుతిహాసన్‌ని కథానాయికగా ఎంచుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మంగళవారం ఆమె సెట్లో అడుగుపెట్టింది కూడా. శ్రుతితో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. చిరు - శ్రుతి జోడీ కట్టడం ఇదే తొలిసారి. కాబట్టి.. వీరిద్దరి మధ్య కెమిస్ర్టీ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. చిరు-రవితేజ అన్నదమ్ముల్లా నటించే అవకాశం ఉందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 


Updated Date - 2022-04-20T06:51:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!