సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘యశోద’ కథ వినగానే షాకయ్యా!

ABN, First Publish Date - 2022-10-30T09:48:26+05:30

సమంత టైటిల్‌ పాత్ర పోషించిన చిత్రం ‘యశోద’. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రధారి. నవంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత టైటిల్‌ పాత్ర పోషించిన చిత్రం ‘యశోద’. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రధారి. నవంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘యశోద’ గురించి, అందులోని తన పాత్ర గురించి వరలక్ష్మి మాట్లాడుతూ ‘‘యశోద కథ వినగానే షాకయ్యా. ఇలాంటి కథని, ఇలాంటి పాత్రల్ని ఎలా రాశారు? అని ఆశ్చర్యపోయాను. నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. కథ సాగుతున్న కొద్దీ నా పాత్రలోని కొత్త కోణాలు బయటకు వస్తాయి. అవి మరింత షాకింగ్‌ గా ఉంటాయి. సమంతతో పాటు నా పాత్ర కూడా సమాంతరంగా సాగుతుంది. ఇద్దరి మధ్యా మంచి సన్నివేశాలు ఉన్నాయి. సరోగసీ ఈమధ్య చర్చనీయాంశం అయింది. ఆ పాయింట్‌ ఈ కథలో కాస్త టచ్‌ చేశామంతే. సమాజంలో ఎలాంటి మనుషులు ఉన్నారు? వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు? అనే విషయాల్ని ఈ సినిమాలో ఆసక్తికరంగా చెప్పారు. హరి, హరీశ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాళ్ల వర్కింగ్‌ స్టైల్‌ నాకు నచ్చింది. ఇద్దరూ చాలా కామ్‌. సెట్లో ఎప్పుడూ అరిచింది లేదు. వాళ్లకు ఏం కావాలో బాగా తెలుసు. నటీనటుల నుంచి కావల్సిన అవుట్‌ పుట్‌ రాబట్టుకొన్నారు. ‘క్రాక్‌’ తరవాత తెలుగులో నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. నా కోసం కథలు రాస్తున్నారు. కొత్త పాత్రలు సృష్టిస్తున్నారు. స్టీరియో టైపు పాత్రలు నా వరకూ రాకపోవడం నా అదృష్టం’’ అన్నారు. 


Updated Date - 2022-10-30T09:48:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!