సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సినిమాలు మానేద్దామనుకొన్నా!

ABN, First Publish Date - 2022-07-25T06:15:08+05:30

దక్షిణాది కథానాయికలో పూజా హెగ్డేకి అగ్ర తాంబూలం ఇచ్చేయొచ్చు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోల సరసన నటిస్తోంది పూజా. హిందీ నుంచి కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాది కథానాయికలో పూజా హెగ్డేకి అగ్ర తాంబూలం ఇచ్చేయొచ్చు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోల సరసన నటిస్తోంది పూజా. హిందీ నుంచి కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పారితోషికంలో కూడా పూజా టాప్‌. ఒక్కో సినిమాకీ రూ.4 కోట్ల వరకూ అందుకొంటోందని టాక్‌. మరో రెండేళ్ల పాటు పూజా కాల్షీట్లన్నీ బిజీనే. ‘పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఈ స్టార్‌ డమ్‌ ఊహించారా’ అని పూజాని ఆడిగితే.. ‘‘నా తొలి రెండు చిత్రాలూ ఫ్లాపులే. ఆ ఫలితాలు నాలో ఏరకంగానూ ఆత్మ విశ్వాసాన్ని నింపలేకపోయాయి. దాంతో నాకు భయం పట్టుకొంది. ‘నాకు ఒక్క హిట్టు కూడా పడదా’ అని నిత్యం అదే ఆలోచనలో ఉండేదాన్ని. ‘ఒకే ఒక్క హిట్టు కొట్టి.. పరిశ్రమ నుంచి తప్పుకొందాం’ అనుకొన్నా. ఎందుకంటే ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్ర నాకు వద్దు. అందుకే హిట్టు పడగానే.. సినిమాలు మానేస్తే ఎలా ఉంటుంది? అనుకొనేదాన్ని. క్రమంగా నేను ఎదురు చూసిన విజయాలు వచ్చాయి. ఒకదాని తరవాత మరో విజయం.. అలా.. నిలబడిపోయా. ఇప్పుడున్న స్థానం నేను కలలో కూడా ఊహించలేనిది. నేను ఆశించిన దానికంటే దేవుడు ఎక్కువే ఇచ్చాడు. నా ప్రతిభకు మించిన స్థానంలోనే ఉన్నా. ఇంతకంటే ఇంకేం కోరుకోవాలి’’ అని చెప్పుకొచ్చింది. 

Updated Date - 2022-07-25T06:15:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!