హెబ్బులి డబ్బింగ్ పూర్తి
ABN, First Publish Date - 2022-12-28T02:48:40+05:30
కిచ్చా సుదీప్, అమలాపాల్ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘హెబ్బులి’. ఎస్. కృష్ణ దర్శకత్వంలో సి. సుబ్రహ్మణ్యం నిర్మించారు.
కిచ్చా సుదీప్, అమలాపాల్ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘హెబ్బులి’. ఎస్. కృష్ణ దర్శకత్వంలో సి. సుబ్రహ్మణ్యం నిర్మించారు. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రంలోని ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అలరిస్తాయని చిత్రబృందం పేర్కొంది. వి. రవిచంద్రన్, పి. రవిశంకర్, కబీర్ దుహన్‌సింగ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: ఎ. కరుణాకర్.