సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pawan Kalyan: ‘భవదీయుడు భగత్‌సింగ్’ పేరు మార్చేశారుగా.. కొత్త టైటిల్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-12-11T16:46:50+05:30

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే.. వరుస సినిమాలలో సినీ కెరీర్‌లోనూ దూసుకెళుతున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే.. వరుస సినిమాలతో సినీ కెరీర్‌లోనూ దూసుకెళుతున్నారు. ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో  ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. ఇటీవలే ‘సాహో’ దర్శకుడు సుజీత్ (Sahoo Sujeeth) కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వచ్చింది. అయితే.. దీని కంటే ముందు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే చిత్రం చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ని తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.


అయితే.. ఆ సినిమా పేరుని మార్చి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad BhagatSingh) అనే టైటిల్‌తో ఆ పోస్టర్‌ని మూవీ టీం విడుదల చేసింది. దీనికి ‘మనల్ని ఎవడ్రా ఆపేది...’ అనే ట్యాగ్‌లైన్‌. అంతేకాకుండా.. ‘ఈ సారి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు’ అని పోస్టర్ మీద రాసుకొచ్చారు. ఆ పోస్ట్‌కి ‘పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈసారి వినోదానికి మించినది. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌ కల్యాణ్‌- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ రెండో చిత్రం ఇదే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. 



Updated Date - 2022-12-11T16:46:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!