ఊటీలో ఘోస్ట్
ABN, First Publish Date - 2022-04-04T06:31:23+05:30
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఆయన సరికొత్త పాత్రలో యాక్షన్ పండించనున్నారు...
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఆయన సరికొత్త పాత్రలో యాక్షన్ పండించనున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలె దుబాయ్‌లో యాక్షన్ ఘట్టాలు, ఓ పాటను పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్‌ను ఊటీలో ప్రారంభించనున్నట్లు ప్రవీణ్ సత్తారు ట్విట్టర్‌లో తెలిపారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయిక గా నటిస్తున్నారు.