సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కావేరి నుంచి... గంగ వరకూ

ABN, First Publish Date - 2022-09-28T11:50:03+05:30

జైద్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బెనారస్‌’. సోనాల్‌ మెంటేరో కథానాయిక. జయతీర్థ దర్శకత్వం వహించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైద్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బెనారస్‌’. సోనాల్‌ మెంటేరో కథానాయిక. జయతీర్థ దర్శకత్వం వహించారు. తిలకరాజ్‌ బల్లాల్‌ నిర్మాత. నవంబరు 4న విడుదల కానుంది. ఇటీవల బెంగళూరులో ట్రైలర్‌ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇది కన్నడ చిత్రం. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించాం. కావేరి దగ్గర మొదలైన ఈ కథ గంగా నది దగ్గర ముగుస్తుంది. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగుతుంది. ప్రతీ యేటా బెనార్‌సకి కొన్ని కోట్ల మంది భక్తులు వస్తుంటారు. వాళ్లంతా ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూశారు. నాకు ఈ నగరంలో ప్రేమ కూడా కనిపించింది. మణికర్ణిక ఘాట్‌ నేపథ్యంలోనూ కొన్ని ప్రేమ సన్నివేశాలు రాసుకొన్నా’’ అన్నారు. జైద్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘‘నేను ముస్లింని. అయినా హిందూ అబ్బాయిగా నటించడానికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఎందుకంటే నేను ముందు కళాకారుడ్ని. అందుకే పాత్రలో లీనమైపోయా. నటుడ్ని కావాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింద’’న్నారు. 

Updated Date - 2022-09-28T11:50:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!