సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manushi Chhillar: మెగా హీరోతో రొమాన్స్

ABN, First Publish Date - 2022-11-17T00:38:53+05:30

మానుషి త్వరలోనే టాలీవుడ్‌‌కు ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మెగా హీరో చిత్రంలో ఛాన్స్ కొట్టేసినట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటువంటి అండదండలు లేకుండా సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మానుషి చిల్లార్ (Manushi Chhillar). మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ తో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. మానుషి త్వరలోనే టాలీవుడ్‌‌కు ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మెగా హీరో చిత్రంలో ఛాన్స్ కొట్టేసినట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.     


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakti Pratap Singh Hada) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి ‘విటి13’ (VT13)అని వర్కింగ్ టైటిల్‌ పెట్టారు. కొన్ని రోజుల క్రితమే ప్రాజెక్టును ప్రకటించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో చిత్రం రూపొందనుంది. వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తారని సమాచారం. ఈ చిత్రం బై లింగ్విల్‌గా తెలుగు, హిందీలో ఒకేసారి రూపొందనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్ల మానుషి చిల్లర్‌తో చర్చలు జరపగా.. ఆమె అంగీకరించిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ‘విటి13’ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనెసాన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ యాక్షన్ డ్రామా 2023లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతుంది. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. ‘గని’ లో చివరగా నటించాడు. సయిూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. భారీ తారగణంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. 

Updated Date - 2022-11-17T00:38:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!