సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

లైంగిక వేధింపులపై పోరాటం

ABN, First Publish Date - 2022-05-05T09:43:41+05:30

క్రీడారంగంలో జరుగుతున్న అన్యాయాలు, లైంగిక వేధింపులపై ఓ యువతి చేసిన పోరాటం కథాంశంగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘జనతాబార్‌’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రీడారంగంలో జరుగుతున్న అన్యాయాలు, లైంగిక వేధింపులపై ఓ యువతి చేసిన పోరాటం కథాంశంగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘జనతాబార్‌’. రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రం టైటిల్‌ లోగోని, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ ‘నాలుగు పాటలు మినహా చిత్రం పూర్తయింది. ఈ నెల ఎనిమిది నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆ పాటలను చిత్రీకరిస్తాం. అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో సమాజానికి మంచి సందేశం కూడా ఉంది. రాయ్‌లక్ష్మి పాత్ర, ఆమె నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి’ అని తెలిపారు.  శక్తి కపూర్‌, ప్రదీప్‌ రావత్‌, సురేశ్‌, అనూష్‌ సోని, అమన్‌ ప్రీత్‌, భూపాల్‌రాజ్‌, విజయభాస్కర్‌, దీక్షాపంత్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు.


Updated Date - 2022-05-05T09:43:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!