దావూద్‌ని పట్టేశారా?
ABN, First Publish Date - 2022-03-24T05:36:43+05:30
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంని పట్టుకోవడానికి దేశంలో ఉన్న పోలీసులు, ఇంటిలిజెంట్ వ్యవస్థ ముప్పు తిప్పలు పడుతుంటే,..
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంని పట్టుకోవడానికి దేశంలో ఉన్న పోలీసులు, ఇంటిలిజెంట్ వ్యవస్థ ముప్పు తిప్పలు పడుతుంటే, ముగ్గురు పిల్లగాళ్లు మాత్రం ‘దావూద్ ఇంటికి దారేది’ అనుకుంటూ ఆ క్రిమినల్ ని పట్టుకోవడానికి బయల్దేరారు. మరి వాళ్ల ప్రయత్నం ఏమైంది? ఆ దారిలో వాళ్లకు ఎదురైన సమస్యలేంటి? అనే విషయాల చుట్టూ తిరిగే కథ ‘మిషన్ ఇంపాజిబుల్’. తాప్సి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రమిది. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’తో ఆకట్టుకున్న స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకుడు. ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నారు. ఇటీవల ‘అదృష్టం..’ అనే పాటని చిత్రబృందం విడుదల చేసింది. మార్క్ కె.రాబిన్ సంగీతం అందించారు. ‘‘ఓ తమాషా కథ ఇది. యాక్షన్, థ్రిల్, వినోదం అన్నీ ఉంటాయి. రఘుపతి రాఘవ రాజారామ్ పాత్రల్లో ముగ్గురి పిల్లల నటన ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు దర్శక నిర్మాతలు.