సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నాన్నే నా హీరో

ABN, First Publish Date - 2022-08-03T06:07:25+05:30

మమ్ముట్టి లాంటి ఓ పెద్ద స్టార్‌కు వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినా హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మమ్ముట్టి లాంటి ఓ పెద్ద స్టార్‌కు వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినా హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకూ చేరువయ్యారు. ‘మహానటి’తో మెప్పించి, ‘కనులు కనులను దోచాయంటే’ అంటూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తన స్థానం పదిలం చేసుకున్నారు. ఇప్పుడు ‘సీతారామం’ అంటూ యుద్ధంతో రాసిన సరికొత్త ప్రేమకథను చెప్పడానికి వ స్తున్నారు. ఆయన హీరోగా మృణాళిని ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ఇది. ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దుల్కర్‌ పంచుకున్న విశేషాలు


మలయాళంలో నా తోటి హీరోలు ఏడాదికి పన్నెండు సినిమాలు చేస్తున్నారు. ఒక టైంలో మా నాన్న ఏడాదికి ముప్పై సినిమాలు చేశారు. వాళ్లతో పోలిస్తే నేను చాలా తక్కువ చేసినట్లే. నాన్నే నాకు ఆదర్శం. నా హీరో. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన గర్వపడే సినిమాలు చేయాలనుంది. నేను చేసే సినిమాల గురించి సింగిల్‌ లైన్‌లో ఆయనకు చెబుతుంటాను. ప్రేమకథలకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలనుకుంటున్నాను. పరిణతి గల విభిన్నమైన పాత్రలు చేయాలనుంది.


‘సీతారామం’ చాలా ఒరిజినల్‌ కథ. అరుదైన చిత్రం. క్లాసిక్‌ మూవీ అని చెప్పవచ్చు. ఇలాంటి సినిమా ఇప్పటిదాకా రాలేదు. స్ర్కీన్‌ప్లే నాకు బాగా నచ్చింది. ఊహాతీతంగా ఉంటుంది. ట్రైలర్‌లో కొంతే చూశారు. ‘సీతారామం’ అద్భుతాన్ని వెండితెరపైనే చూడాలి. 


ఈ చిత్రంలో రామ్‌ అనే ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తాను. అతనికి దేశభక్తి ఎక్కువ. తనొక అనాథ అయినా ఎప్పుడూ సంతోషంగా ఉంటూ నలుగురికి సాయపడే మంచి మనసున ్న వ్యక్తి. విశాల్‌ చంద్రశేఖర్‌ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చారు. పాటలన్నీ దృశ్య కావ్యంలా ఉంటాయి. ‘కానున్న కల్యాణం’ పాట నాకు బాగా నచ్చింది. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. 


దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను అద్భుతంగా ప్రజెంట్‌ చేశాడు. కథ వింటున్నప్పుడే సీత పాత్రను చాలా గొప్పగా ఊహించుకున్నాను. హీరోయిన్‌ పాత్రకు మృణాల్‌ సరైన ఎంపిక. చక్కగా ఒదిగిపోయారు. బయట కూడా తను చాలా ఉత్సాహంగా ఉంటారు. రష్మిక ఇప్పటిదాకా చేయని పాత్రను చేశారు. ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు. గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌తో రెండోసారి నటించడం ఆనందంగా ఉంది. 


వైజయంతీ మూవీస్‌ నా కుటుంబం లాంటిది. అశ్వనీదత్‌ గారు అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే ఆయనకు చాలా అభిమానం. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటారు. ‘మహానటి’ సమయంలో ప్రచార కార్యక్రమాలకు రాలేకపోయాను. ఇప్పుడు వైజాగ్‌, విజయవాడల్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌  చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 


Updated Date - 2022-08-03T06:07:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!