బాల తార
ABN, First Publish Date - 2022-11-08T05:51:41+05:30
సినిమాల్లో నటించాలనే కోరిక తీర్చుకోవడానికి పదేళ్ల బాలిక చేసిన సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తార’....
సినిమాల్లో నటించాలనే కోరిక తీర్చుకోవడానికి పదేళ్ల బాలిక చేసిన సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తార’. పి. పద్మావతి సమర్పణలో వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్నారు. మల్లిబాబు దర్శకుడు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ క్లాప్ ఇచ్చారు. సాయివెంకట్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేం కిశోర్ కథానాయకుడు. సత్యకృష్ణ హీరోయిన్. బేబీ తుషార, బేబీ నాగహాసిని, మాస్టర్ హర్షవర్ధన్, అజయ్‌ఘోష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు.