Bapatla Mp: బాపట్ల ఎంపీ బయోపిక్!
ABN, First Publish Date - 2022-08-21T22:34:45+05:30
సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి, తను నమ్మిన సిద్థాంతాల కోసం నిజాయితీగా పోరాటం చేస్తూ, ఒక బలమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమా కథ’’ అని దర్శకుడు నానాజీ మిరియాల అన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బాపట్ల ఎంపీ నందిగం సురేష్’(Bapatla mp).
సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి, తను నమ్మిన సిద్థాంతాల కోసం నిజాయితీగా పోరాటం చేస్తూ, ఒక బలమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమా కథ’’ అని దర్శకుడు నానాజీ మిరియాల అన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బాపట్ల ఎంపీ నందిగం సురేష్’(Bapatla mp). అగస్త్య(Agastya), నక్షత్ర (Nakshatra)జంటగా నటిస్తున్నారు. సురేఖ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నందిగం వెంకట్ నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలైంది. తొలి ముహూర్తపు సన్నివేశానికి యం.పి నందిగం సురేష్, క్లాప్ నివ్వగా నిర్మాతల కుమారులు దేవన్, ప్రిన్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
నందిగం వెంకట్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచీ తమ్ముడు నాతో చేసిన జర్నీ, తర్వాత యూత్ ప్రెసిడెంట్‌గా ఎదిగిన వైనం. కొన్ని దుష్ట శక్తులు అణిచివేయడం చేయరాని, చేయలేని, చేయకూడని సంఘటనలో మా తమ్ముడిని ఇరికించాలని చూడడం, ఆ తర్వాత ఎం.పిఎలా అయ్యాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది’’ అని అన్నారు.
‘‘ఇది బాపట్ల ఎం.పి నందిగం సురేష్ లైఫ్ స్టోరీ. అరిటాకులు కొసుకొని బ్రతికే ఒక సామాన్య వ్యక్తి నిజాయితీని నమ్ముకొని, నమ్మిన సిద్థాంతాలతో ముందుకు వెళ్తుండగా ఎదురైన సమస్యలను దాటుకుని ఎలా తన గమ్యాన్ని చేరుకున్నాడు అన్నది కథ. ఏ పని చేసినా నిజాయితీగా చేేస్త కచ్చితంగా ఎదుగుతాడు అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని దర్శకుడు అన్నారు.