సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anasuya: ఎక్కడికో వెళ్లిపోతుంది!

ABN, First Publish Date - 2022-09-13T19:00:54+05:30

ఈ మధ్య అనసూయ (Anasuya)లీడ్‌గా నటించిన ‘దర్జా' సినిమా అంతగా ఆడలేదు. అయితేనేమి, అనసూయకి రానున్న రోజుల్లో మంచి సినిమాలు రానున్నాయి. ఆమె నటిస్తున్న 'పుష్ప 2’(Pushpa 2)లో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండేటట్లు దర్శకుడు ప్లాన్‌ చేశారట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్య అనసూయ (Anasuya)లీడ్‌గా నటించిన ‘దర్జా'  సినిమా అంతగా ఆడలేదు. అయితేనేమి, అనసూయకి రానున్న రోజుల్లో మంచి సినిమాలు రానున్నాయి. ఆమె నటిస్తున్న  'పుష్ప 2’(Pushpa 2)లో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండేటట్లు దర్శకుడు ప్లాన్‌ చేశారట. పార్ట్‌ 1 కన్నా,  పార్ట్‌ 2లో అనసూయ ఇంకా అదరగొడుతుందనీ, దక్షాయణి పాత్ర ఆమెకు కెరీర్‌ బెస్ట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అలాగే అనసూయ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు శివ ప్రసాద్‌ దర్శకత్వంలో ‘విమానం’ (Vimanam)అనే చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా అనసూయ ముఖ్య పోషిస్తున్నారనీ, బెస్ట్‌ చిత్రం అవుతుందని చెబుతున్నారు. ఇందులో అనసూయతోపాటు సముద్రఖని, ధనరాజ్‌ ఉంటారని సమాచారం. ఈ కథ నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందని అందులో అనసూయ ఒకటని సమాచారం. ఇవన్నీ కాకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగ మార్తాండ’ సినిమా కూడా ఉంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తై, విడుదలకు సిద్ధంగా ఉంది. 


ఏ ఆర్టిస్ట్‌ అయినా కృష్ణవంశీ దర్శకత్వంలో ఇకసారైనా నటించాలనుకుంటారు. కృష్ణవంశీ సినిమాలో ఆర్టిస్‌ల పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన చూపించే తీరు అలా ఉంటుంది. సినిమా ఫలితం లేకుండా ఆధారపడకుండా ఆయన సినిమాలో ఒక్కసారి నటిస్తే చాలనుకుంటారు.  అలాంటిది అనసూయకి ఆ ఛాన్స్‌ వచ్చింది. ఇందులో కూడా అనసూయ నటన పీక్స్‌లో ఉంటుంది అని కూడా తెలిసింది. అనసూయకి మంచి  పేరు తెచ్చే చిత్రాలని మున్ముందు రానున్నాయి. ఈ చిత్రాలతో ఆమె కెరీర్‌ టర్న్  అవుతుందని చెబుతున్నారు.  మరో పక్క బుల్లితెరపై కూడా అనసూయ బిజీగా ఉన్నారు. 


Updated Date - 2022-09-13T19:00:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!