సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అన్వితగా మారిన అనుష్క

ABN, First Publish Date - 2022-11-08T06:00:49+05:30

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రధారులుగా యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రధారులుగా యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. పి.మహేశ్‌ బాబు దర్శకుడు. ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకొంటోంది. ఇందులో అనుష్క అన్విత రవళి అనే చెఫ్‌ పాత్రలో కనిపించబోతున్నారు. సోమవారం అనుష్క జన్మదినం. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని అనుష్క ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. చెఫ్‌ వస్త్రధారణలో వంటింటిని ఘుమఘుమలాడిస్తున్న అనుష్క స్టిల్‌ ఇది. 2023లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్‌, ఇతర వివరాల్ని చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.


Updated Date - 2022-11-08T06:00:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!