సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కన్నీటి వీడ్కోలు

ABN, First Publish Date - 2022-11-17T09:34:50+05:30

కృష్ణ పార్దివ దేహానికి నివాళులర్పించేందుకు చిత్ర పరిశ్రమ తరలివచ్చింది. పలువురు సినీ ప్రముఖులు బుధవారం పద్మాలయ స్టూడియోకు చేరుకొని నివాళులర్పించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణ పార్దివ దేహానికి నివాళులర్పించేందుకు చిత్ర పరిశ్రమ తరలివచ్చింది. పలువురు సినీ ప్రముఖులు బుధవారం పద్మాలయ స్టూడియోకు చేరుకొని నివాళులర్పించారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించిన నిర్మాత అల్లు అరవింద్‌ నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పరిశ్రమలో నిర్మాతల బాగు కోరుకున్న ఒకే ఒక హీరో కృష్ణ అని కొనియాడారు. 


నటి, ఏపీ మంత్రి రోజా కృష్ణ కుటుంబ సభ్యులను  పరామర్శించారు. ఆయన మృతిపట్ల ఆవేదన వ్యక్తం చేశారు.  కృష్ణ అద్భుతమైన వ్యక్తి, సాహసాలు, సంచలనాలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పారు. సీనియర్‌ నటులు కోట శ్రీనివాసరావు, నటుడు అలీ, దర్శకుడు త్రివిక్రమ్‌ తదితరులు కృష్ణ పార్దివ దేహానికి నివాళులర్పించారు. 

Updated Date - 2022-11-17T09:34:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!