Varun Dhawan: అటువంటి చిత్రాలు చేసినందుకు గర్వపడుతున్నాను
ABN, First Publish Date - 2022-12-18T16:26:42+05:30
సినీ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు.
సినీ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు. కరోనా లాక్‌డౌన్ అనంతరం వరుణ్ ధావన్ కొత్త కథలను చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఏడాది క్రియేటివ్‌గా సంతృప్తినిచ్చిందని తెలిపాడు.
వరుణ్ ధావన్ ఈ ఏడాది ‘జుగ్ జుగ్ జీయో’ (JugJugg Jeeyo), ‘భేడియా’ (Bhediya) లో నటించాడు. అతడు నటించిన బవాల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ఈ ఏడాది అద్భుతంగా గడిచిందని వరుణ్ ధావన్ చెప్పాడు. ‘‘కొవిడ్ వచ్చినప్పుడు నటుడిగా కెరీర్ ముగిసిందనుకున్నాను. డేట్స్ ఖాళీగా ఉన్నాయని సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల నటుడిగా సంతృప్తినిచ్చే పాత్రలను మాత్రమే చేయాలనుకున్నాను. జుగ్ జుగ్ జీయో, భేడియా, బవాల్ ప్రాజెక్టులకు సంతకం చేయడానికి చాలా కాలం ఎదురు చూశాను. నటుడిగా ఈ ఏడాది నాకు సంతృప్తినిచ్చింది. అటువంటి చిత్రాలు చేసినందుకు గర్వపడుతున్నాను. భేడియా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టలేదు. అయినప్పటికీ, ఈ ఏడాది విడుదలైన చాలా చిత్రాల కంటే అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది’’ అని వరుణ్ ధావన్ తెలిపాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ‘బవాల్’ (Bawaal) లో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ‘స్త్రీ 2’ (Stree 2) లో ఓ కీలక పాత్రలో వరుణ్ నటిస్తున్నాడు.