Urvashi Rautela: రిషభ్ పంత్‌కి యాక్సిడెంట్.. నటి పోస్ట్‌కి అర్థం ఏంటబ్బా!?
ABN, First Publish Date - 2022-12-30T13:52:10+05:30
టీమిండియా క్రికెటర్, కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఘోర ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ (Accident) కావడంతో తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.
టీమిండియా క్రికెటర్, కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఘోర ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ (Accident) కావడంతో తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కారు పూర్తిగా దగ్ధమయినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన రిషభ్ కారులో నుంచి దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో ఎంతోమంది ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రిషబ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా.. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela), రిషభ్‌కి మధ్య ఉన్న లవ్-హేట్ రిలేషన్‌షిప్ గురించి అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రిషబ్‌పై తనకి ఉన్న ఇష్టాన్ని ఊర్వశి వ్యక్తం చేసింది. అనంతరం ఈ బ్యూటీ ఆ వ్యాఖ్యలని ఖండించడంతో పాటు మీడియాలో ప్లాట్‌ఫారమ్‌లలో అతనికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ భామ మాటలకి రిషభ్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు.
కాగా.. యాక్సిడెంట్ అయ్యి రిషభ్ హాస్పిటల్‌లో ఉన్న ఈ తరుణంలో ఊర్వశి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. అందులో ఊర్వశి తెలుపు రంగు దుస్తుల్లో అప్సరసలా ఉన్న తన ఫోటోను షేర్ చేసింది. దానికి ‘ప్రార్థిస్తున్నాను’ (Praying) అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అంతేకుండా తెలుపు హృదయం, పావురం ఎమోజీని జోడించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో పలువురు నెటిజన్లు రిషభ్ గురించే అన్నట్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
‘రిషభ్ ప్రేమలో పిచ్చిది అయిపోతోంది’ అని ఒకరు.. ‘రిషభ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఉంది’ అని మరొకరు.. ‘బాధ పడకు. రిషభ్ త్వరగానే కోలుకుంటాడు’ అని ఇంకొకరు.. ‘త్వరగా కోలుకో అని రిషభ్‌కి డైరెక్ట్‌గా చెప్పొచ్చుగా’ అని వేరొకరు కామెంట్స్ చేశారు.