Nora Fatehi: జాక్వెలిన్‌పై పరువు నష్టం దావా.. స్వప్రయోజనాల కోసమేనంటూ..
ABN, First Publish Date - 2022-12-13T12:03:27+05:30
మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌పై నమోదైన కేసులో బాలీవుడ్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), నోరా ఫతేహి (Nora Fatehi)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌పై నమోదైన కేసులో బాలీవుడ్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), నోరా ఫతేహి (Nora Fatehi)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా జాక్వెలిన్‌పై నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. ఆమె తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన కెరీర్‌ని నాశనం చేసేందుకు జాక్వెలిన్ ప్రయత్నించిందని నోరా అందులో ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్‌పై ఈ భామ పరువు నష్టం దావా (defamation suit) వేసింది.
గతంలో జాక్వెలిన్ కోర్టుకి రాతపూర్వక వివరణ ఇచ్చింది. అందులో మనీలాండరింగ్ కేసులో ఈడీ తనని తప్పుగా చూపిస్తోందని.. నోరా ఫతేహి లాంటి పలువురు సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు పొందారని జాక్వెలిన్ ఆరోపించింది. అయితే.. సుఖేష్ నుంచి తను ఎలాంటి బహుమతులు తీసుకోలేదని.. అతనితో తనకి ఎలాంటి సంబంధం లేదని నోరా పిటిషన్‌లో పేర్కొంది. అలాగే మరికొన్ని మీడియా సంస్థల పేర్లను కూడా ఆమె అందులో ప్రస్తావించింది.
మీడియా సంస్థలు తనపై ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేయడమంటేజజ సామూహిక దాడి చేయడమేనని నోరా తెలిపింది. ఈ కేసులోకి తనపేరును అన్యాయంగా లాగారని.. ఇదంతా జాక్వెలిన్ ఆదేశాల ప్రకారమే జరిగిందని ఆమె ఆరోపించింది. మరోవైపు జాక్వెలిన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నోరాపై తమకు గౌరవం ఉందని.. మనీలాండరింగ్ కేసులో ఇద్దరు నటీమణులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని తెలిపారు.