సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

BesharamRang: ‘పఠాన్’ టీమ్‌కు మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ వార్నింగ్

ABN, First Publish Date - 2022-12-14T23:01:57+05:30

‘భేషరమ్ రంగ్’ సాంగ్‌‌లోని అసభ్యకర సన్నివేశాలను తొలగించకుంటే.. సినిమానే బ్యాన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు

Pathaan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘భేషరమ్ రంగ్’ సాంగ్‌‌లోని అసభ్యకర సన్నివేశాలను తొలగించకుంటే.. సినిమానే బ్యాన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా. ఇదే విషయం చెబుతూ.. ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న చిత్రం ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ (Besharam Rang) అనే వీడియో సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా, బాలీవుడ్‌లో ఏ భామ చేయని విధంగా.. దీపికా ఇందులో బికినీ అందాలతో రెచ్చిపోయింది. అయితే ఆమె ఏ రేంజ్‌లో అయితే రెచ్చిపోయిందో.. అదే రేంజ్‌లో వివాదం కూడా అవుతుండటం విశేషం.

షారుఖ్‌తో కలిసి.. దీపికా పదుకొనె శృతి మించిన తీరుపై.. నెటిజన్లు కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు బాలీవుడ్ ఇంత దిగజారిపోయిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, దీపికని షారుఖ్ ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తుంటే.. ఆమె ఇంకాస్త ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఈ పాటలో ఆమె డ్యాన్స్ ఉంది. ఈ పాట విడుదలైన తర్వాత రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నప్పటికీ.. అదే స్థాయిలో బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు కూడా ట్రోలింగ్ మొదలెట్టారు. ఈ పాటపై మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా (Narottam Mishra) తాజాగా సంచలన వ్యాఖలు చేశారు. ఈ చిత్రంలో అసభ్యకరమైన సన్నివేశాలు తొలగించకుంటే సినిమానే తొలగించాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. భేషరమ్ రంగ్ సాంగ్‌‌లో దీపికా కాషాయం వస్త్రాలు ధరించి అసభ్యంగా కనిపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతూ.. వెంటనే ఆ పాటని తొలగించకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Updated Date - 2022-12-14T23:02:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!