తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ABN, First Publish Date - 2022-11-17T13:48:16+05:30
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా నవంబర్ 3న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
ది వండర్ (The Wonder)
ది వండర్ అనేది సెబాస్టియన్ లెలియో దర్శకత్వం వహించిన 2022 పీరియాడికల్ డ్రామా చిత్రం. ఇది 2016లో విడుదలైన 'ది వండర్' అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఫ్లోరెన్స్ పగ్, టామ్ బుర్క్, ఎలైన్ కాసిడీ, కిలా లార్డ్ కాసిడీ, నియామ్ అల్గర్, టోబి జోన్స్, సియరాన్ హిండ్స్ నటించారు. ది వండర్ సెప్టెంబర్ 2, 2022న టెల్లూరైడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది.
డెసిషన్ టు లీవ్ (Decision to Leave)
డెసిషన్ టు లీవ్ అనేది 2022లో దక్షిణ కొరియాకు చెందిన రొమాంటిక్ మిస్టరీ చిత్రం. పార్క్-వూక్ దర్శకత్వం వహించాడు. ఇందులో టాంగ్ వీ, పార్క్ హే ఇల్ నటించారు. ఏప్రిల్ 2022లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డి'ఓర్ అవార్డు కోసం పోటీ పడేందుకు ఎంపికైంది. ఆ ఫెస్టివల్‌లో ఈ చిత్ర దర్శకుడు పార్క్ చాన్ వూక్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ చిత్రం 29 జూన్ 2022న దక్షిణ కొరియాలో థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అలాగే ఈ 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం విభాగం దక్షిణ కొరియా నుంచి అధికారికంగా ఎంపిక అయ్యింది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మూబీలో స్ట్రిమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
One of Us Is Lying Season 2 - ఇంగ్లిష్
Mind Your Manners - ఇంగ్లిష్
In Her Hands - ఇంగ్లిష్, పర్షియన్
The Lost Lotteries - థాయ్
Racionais MC's: From the Streets of São Paulo - పోర్చుగీస్
Off Track - డానిష్, స్వీడిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)
The Santa Clauses - ఇంగ్లిష్
Limitless with Chris Hemsworth - ఇంగ్లిష్
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)
Hostel Daze Season 3 - హిందీ
మూబీ (Mubi)
El Planeta - స్పానిష్