సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2022-11-04T13:49:07+05:30

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా నవంబర్ 3న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


కోస్టా బ్రావా లెబనాన్ (Costa Brava Lebanon)

లెబనాన్‌ రాజధాని అయిన బీరూట్‌లో కాలుష్యం వీపరీతంగా పెరిగిపోతుంది. అది నచ్చిన ఓ జంట సిటీకి దూరంగా ఉన్న కొండల్లో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది. ఈ తరుణంలో వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఆ జంట ఎలా ఎదుర్కొదనేది అరబిక్‌ చిత్ర కథాంశం. మౌనియా అక్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాడిన్ లబాకి, సలేహ్ బక్రి, నాడియా చార్బెల్, సియానా రెస్టోమ్, జియానా రెస్టోమ్, లిలియన్ చాకర్ ఖౌరీ, యుమ్నా మార్వాన్, ఫ్రాంకోయిస్ నౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


మేడ్ ఇన్ అబిస్ (Made in Abyss)

మేడ్ ఇన్ అబిస్ అనేది జపనీస్ మాంగా సిరీస్. దీనికి అకిహిటో సుకుషి రచన, దర్శకత్వం వహించాడు. 2012లో వెబ్‌ కామిక్‌ గామాలో ఆన్‌లైన్‌ లో ప్రసారమైన సీరియల్‌ ఆధారంగా ఈ యానిమేటేడ్‌ వెబ్‌సిరీస్‌ని తెరకెక్కించారు. రికో అనే అనాథ  అమ్మాయికి రెడ్‌ హ్యూమనాయిడ్ రోబోట్‌ దొరుకుతుంది. దానితో ఆ అమ్మాయికి స్నేహం కుదురుతుంది. ఆ రోబోతో కలిసి ఆ అమ్మాయి తన తల్లిని కనుక్కోడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణలో రికోకి ఎదురైన సమస్యల సమాహారమే ఈ మేడ్‌ ఇన్‌ అబిస్‌. ఈ వెబ్‌సిరీస్‌ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Panyotis Pascot Almost - ఫ్రెంచ్‌

The Dragon Prince Season 4 - ఇంగ్లిష్‌

Blockbuster - ఇంగ్లిష్‌, హిందీ


సోనీ లివ్ (Sony LIV)

Kaiyum Kalavum - తమిళం, హిందీ





Updated Date - 2022-11-04T13:49:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!