సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ జెర్సీ’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు కరోనా

ABN, First Publish Date - 2022-01-01T20:42:41+05:30

‘ జెర్సీ’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అభిమానులకు కొత్త ఏడాది మొదటి రోజునే చేదు కబురు అందింది. ఆమె కోవిడ్‌కు పాజిట్‌గా తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ జెర్సీ’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అభిమానులకు కొత్త ఏడాది మొదటి రోజునే చేదు కబురు అందింది. ఆమె కోవిడ్‌కు పాజిట్‌గా తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంది. గత కొన్ని వారాలు ‘ జెర్సీ ’ సినిమా ప్రమోషన్స్‌ల్లో ఆమె పాల్గొంది.


‘‘ నేను కోవిడ్ 19కు పాజిటివ్‌గా తేలాను. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. ఈ మధ్య ఎవరైనా నన్ను కలిస్తే తప్పకుండా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నాను ’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఠాకూర్ పేర్కొంది.


‘ జెర్సీ’ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన ఆమె నటించింది. డిసెంబర్ 31న ఈ సినిమా విడుల కావాల్సి ఉంది. కానీ, కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు.

Updated Date - 2022-01-01T20:42:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!