Janhvi Kapoor: ఓటీటీలోకి వచ్చేసిన ‘మిలీ’!
ABN , First Publish Date - 2022-12-30T18:31:30+05:30 IST
శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). దఢక్ సినిమాతో వెండితెరపైకి రంగప్రవేశం చేసింది.
శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). దఢక్ సినిమాతో వెండితెరపైకి రంగప్రవేశం చేసింది. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘గుడ్ లక్ జెర్రీ’ వంటి చిత్రాలతో తనలో మంచి నటి ఉందని నిరూపించుకుంది. చివరగా ఆమె నటించిన మూవీ ‘మిలీ’ (Mili). మలయాళం హిట్ మూవీ ‘హెలెన్’ (Helen)ను రీమేక్‌గా తెరకెక్కింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందింది. మత్తుకుట్టి జేవియర్ (Mathukutty Xavier) దర్శకత్వం వహించాడు. బొనీ కపూర్ నిర్మించాడు. విభిన్న ప్రయత్నంగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికి.. అభిమానుల ఆదరణను సంపాదించుకోలేకపోయింది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
మిలీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. కొన్ని రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా మిగిలినప్పటికీ ఓటీటీలో మాత్రం మంచి వీక్షణలను సాధిస్తున్నాయి. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (Hit: The First Case) సౌత్ రీమేక్ బాలీవుడ్‌లో ప్లాఫ్ అయిన సంగతి తెలిసిందే. కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం రికార్డ్ వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు ఐదు వారాల పాటు ట్రెండ్ అయింది. ‘మాచర్ల నియోజక వర్గం’ కూడా ‘జీ-5’ లో భారీ వీక్షణలను సాధించింది. ఈ రెండు చిత్రాల బాటలోనే ‘మిలీ’ పయనిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.