Deepika Padukone: చరిత్ర సృష్టించిన దీపిక
ABN, First Publish Date - 2022-12-19T16:29:09+05:30
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) చరిత్ర సృష్టించింది. భారత్ గర్వపడేలా చేసింది. ఫిఫా వరల్డ్ కప్ ట్రోపీని ఆవిష్కరించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఖతర్‌లోని లుసైల్ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) చరిత్ర సృష్టించింది. భారత్ గర్వపడేలా చేసింది. ఫిఫా వరల్డ్ కప్ ట్రోపీని ఆవిష్కరించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఖతర్‌లోని లుసైల్ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ట్రోపీని ఆవిష్కరించడం ఆనవాయితి. ఈ సారి ఆ అవకాశం దీపికా పదుకొణెకు వచ్చింది. అందులో భాగంగా ట్రోపీని దీపికా పదుకొణె ఆవిష్కరించింది. అనంతరం స్పెయిన్ ఫుట్‌బాల్ మాజీ ప్లేయర్ కాసిల్లాస్ ఫెర్నాండెజ్‌తో కలసి నడిచింది. కెమెరాలకు ఫోజులిచ్చింది. అర్జెంటీనా- ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి సెలబ్రిటీలు కూడా ఈవెంట్‌లో సందడి చేశారు. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచింది.
దీపికా పదుకొణె నిర్మాత, ఎంటర్ ప్రెన్యూర్‌గాను రాణిస్తుంది. ‘లివ్, లవ్, లాఫ్’ అనే ఆర్గనైజేషన్‌ను స్థాపించింది. ఈ సంస్థ తరఫున డిప్రెషన్‌కు గురయిన వారికి చికిత్సను అందిస్తుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోను పాల్గొంది. తాజాగా జ్యూరీ మెంబర్‌గాను మారింది. పలు అంతర్జాతీయ విలాసవంతమైన బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. టైమ్ మ్యాగజైన్ అవార్డును రెండు సార్లు అందుకొంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున పాల్గొంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. దీపికా పదుకొణె తాజాగా ‘పఠాన్’ లో నటించింది. షారూఖ్ ఖాన్ హీరో పాత్రను పోషించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 26న విడుదల కానుంది.