సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘తలైవి’ విడుదల ఎప్పుడు?

ABN, First Publish Date - 2021-07-14T13:47:12+05:30

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌, అరవింద్‌ స్వామి, సముద్ర ఖని కాంబినేషన్‌లో కోలీవుడ్‌ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌  హీరోయిన్‌ కంగనా రనౌత్‌, అరవింద్‌ స్వామి, సముద్ర ఖని కాంబినేషన్‌లో కోలీవుడ్‌ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. నిర్మాణాంతర కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 23న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. కానీ, కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత ఈ మూవీని ఓటీటీలో విడు దల చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఈ వదంతులను నటి కంగనా రనౌత్‌ తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో థియేటర్లు  తెరిచేందుకు ఇంకా అనుమతివ్వలేదు. అదేసమయంలో పలువురు స్టార్‌ హీరోల చిత్రాలు సైతం ఓటీటీలో విడుదలవుతున్నాయి. దీంతో ‘తలైవి’ కూడా ఓటీటీలో విడుదల చేస్తారా? అనే చర్చ మళ్ళీ మొదలైంది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతిచ్చినప్పటికీ థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సాహసం చేయడం లేదు. దీంతో ‘తలైవి’ చిత్రం కూడా మరో ఒకటి రెండు నెలలు ఆగిన తర్వాత విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

Updated Date - 2021-07-14T13:47:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!