సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ విషయంలో పవన్ కల్యాణ్, మహేశ్‌ని దాటేసిన తమిళ స్టార్ విజయ్

ABN, First Publish Date - 2021-12-14T15:04:49+05:30

ప్రతి ఏడు ఎక్కువగా వార్తల్లో నిలిచిన జాబితాని వెల్లడిస్తుంటుంది ట్విట్టర్. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు సైతం ఎక్కువగా ట్విట్‌లో నిలిచిన సౌతిండియా స్టార్ (మేల్) లిస్ట్‌ని వెలువరించింది ట్విట్టర్ ఇండియా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి ఏడు ఎక్కువగా వార్తల్లో నిలిచిన జాబితాని వెల్లడిస్తుంటుంది ట్విట్టర్. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు సైతం ఎక్కువగా ట్విట్‌లో నిలిచిన సౌతిండియా స్టార్ (మేల్) లిస్ట్‌ని వెలువరించింది ట్విట్టర్ ఇండియా. అందులో టాలీవుడ్ స్టార్స్‌ని అధిగమంచిన కోలీవుడ్ స్టార్ టాప్‌లో ఉన్నాడు.


ఆ జాబితాలో తమిళ స్టార్ ‘దళపతి’ విజయ్ ఫ్యాన్స్ ద్వారా ట్విట్లలో నిలిచి అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో రెండో స్థానంలో ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ ‘మహేశ్ బాబు నిలిచారు. నాలుగో స్థానంలో తమిళ నటుడు సూర్య నిలవగా.. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు.


అలాగే ఏడో స్థానంలో తమిళ సూపర్‌స్టార్ ‘రజనీకాంత్’ నిలవగా.. ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో రామ్‌చరణ్, ధనుష్, అజిత్ కుమార్ నిలిచారు. కాగా ఫిమేల్ జాబితాలో కిర్తీ సురేష్ టాప్‌లో ఉండగా.. పూజా హెగ్దే, సమంత వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.


అయితే 2020 సైతం ఈ జాబితాని ప్రకటించింది ట్విట్టర్. అందులో మహేశ్ బాబు అగ్రస్థానంలో నిలవగా.. పవన్ కల్యాణ్, విజయ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. కానీ ఈ ఏడాది టాప్ టాలీవుడ్ స్టార్స్‌ని దాటి ‘దళపతి’ టాప్‌లో నిలవడం విశేషం.

Updated Date - 2021-12-14T15:04:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!