తండ్రయిన ఆర్య
ABN, First Publish Date - 2021-07-25T05:43:56+05:30
తమిళనటుడు ఆర్య భార్య సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హీరో విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తమిళనటుడు ఆర్య భార్య సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హీరో విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నేను మామయ్యను అయ్యాను. ఆర్య, సాయేషాకు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. షూటింగ్ మధ్యలో ఈ విషయం తెలుసుకొని చెప్పలేని అనుభూతికి గురయ్యాను. ఆ బిడ్డకు దేవుడి ఆశీస్సులు లభించాలి అని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు. రెండేళ్ల క్రితం ఆర్య, సయేషా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తెలుగులో అఖిల్‌తో ‘అఖిల్’ చిత్రంలో నటించారు. ఇటీవలె ఆర్య నటించిన ‘సార్పట్ట’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం విశాల్‌తో కలసి ‘ఎనిమీ’ చిత్రంలో నటిస్తున్నారు.