సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పునీత్‌ మరణం.. కసరత్తులే కారణమా?

ABN, First Publish Date - 2021-10-30T20:16:33+05:30

‘‘మనం చాలా అనుకుంటాం. ఎన్నో ప్లాన్‌ చేసుకుంటాం. రకరకాల ఊహల్లో ఉంటాం. కానీ అవేమీ మన చేతుల్లో ఉండవు. విధి ఎలా నిర్ణయిస్తే.. నుదుటి గీత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’’ దీనిలో ఎలాంటి మార్పు ఉండదు’’ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పిన మాటలివి. ఇప్పుడు ఆ మాటలు ఆయన జీవితానికి వర్తిస్తాయని ఊహించలేకపోయామని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘మనం చాలా అనుకుంటాం. ఎన్నో ప్లాన్‌ చేసుకుంటాం. రకరకాల ఊహల్లో ఉంటాం. కానీ అవేమీ మన చేతుల్లో ఉండవు. విధి ఎలా నిర్ణయిస్తే.. నుదుటి గీత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’’ దీనిలో ఎలాంటి మార్పు ఉండదు’’ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పిన మాటలివి. ఇప్పుడు ఆ మాటలు ఆయన జీవితానికి వర్తిస్తాయని ఊహించలేకపోయామని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శాండల్‌వుడ్‌ పవర్‌స్టార్‌ పునీత్‌ మరణంతో కర్ణాటక రాష్ట్రమంత విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన పార్థీవ దేహాన్ని చూసేందుకు అభియానులు తరలి వస్తున్నారు. గతంలో రాజ్‌కుమార్‌ మరణాన్ని తలచుకుని అభిమానులు రోదిస్తున్నారు. 


కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్‌ వెళ్లేవారు. ఆయన మరణించిన రోజున కూడా వాకింగ్‌ చేసి ఇంటికొచ్చిన ఆయన రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన అదే రోజు మధ్యాహ్నాం ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత 2.30 గంటలకు రాజ్‌కుమార్‌ మరణించారని వైద్యులు వెల్లడించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత పునీత్‌ గుండెపోటుతో మరణించడంతో అభిమానుల గుండెలు పిండేసినట్లు అయింది. ఫిట్‌నెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించేవారు.  శుక్రవారం ఉదయం తన పనులు ముగించుకున్న పునీత్‌ జిమ్‌లో అడుగుపెట్టారు. తొమ్మిది గంటలకు వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందనడంతో దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. మెరుగైన  వైద్యం కోసం విక్రమ్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడటానికి  శ్రమించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.  2.30 గంటల సమయంలో పునీత్‌ మరణించినట్లు వైద్యు?ని ఽధృవీకరించారు. అయితే పునీత్‌ మరణానికి కసరత్తులే కారణమా అంటే అవుననే వినిపిస్తోంది. బాడీ ఫిట్‌నెస్‌ కోసం పునీత్‌ తన ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు ఒకటి రెండు గంటలు ఆయన జిమ్‌లోనే గడిపేవారు. అధికంగా వ్యాయామం చేసి ఒత్తిడికి గురికావడం వల్లే ఇలా జరిగిందని శాండల్‌వుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

Updated Date - 2021-10-30T20:16:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!