పెద్ద పెద్ద పుస్తకాలు చూసి.. వైద్య విద్య మనకు సెట్ కాదని నటినయ్యా: నిక్కీ గల్రానీ
ABN, First Publish Date - 2021-11-24T02:37:46+05:30
తాను ఊహించని విధంగా సినిమారంగంలోకి అడుగుపెట్టానని హీరోయిన్ నిక్కీ గల్రానీ అన్నారు. కోలీవుడ్ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా పరిచయమైన ‘డార్లింగ్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా కోలీవుడ్‌కు నిక్కీ గల్రానీ పరిచయమైంది. ఆ తర్వాత పలు..
తాను ఊహించని విధంగా సినిమారంగంలోకి అడుగుపెట్టానని హీరోయిన్ నిక్కీ గల్రానీ అన్నారు. కోలీవుడ్ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా పరిచయమైన ‘డార్లింగ్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా కోలీవుడ్‌కు నిక్కీ గల్రానీ పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించగా, ప్రస్తుతం ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించింది.
‘నిజం చెప్పాలంటే ఏదో ఒక ఫ్లోలో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. చిన్న వయసులో ఉన్నపుడు మా అమ్మ నన్ను డాక్టర్ కావాలని పదేపదే చెబుతుండేది. దీంతో డాక్టర్ చదవాలనే ఆశ కలిగింది. కానీ, పెద్ద పెద్ద పుస్తకాలు చూశాక భయపడిపోయాను. వైద్య విద్య మనకు సెట్ కాదని భావించాను. ఆ తర్వాత మోడలింగ్, సినిమా రంగాల్లోకి ప్రవేశించాను. అలా... నా దిశ మారిపోయింది. హీరోయిన్ కావాలని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ అదే యథేచ్ఛగా జరిగిపోయింది’ అని వివరించారు. కాగా నిక్కీ గల్రానీ హీరో శశికుమార్‌తో కలిసి నటించిన ‘రాజవంశం’, కమెడియన్ కమ్ హీరో మిర్చి శివతో నటించిన ‘ఇడియట్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.