సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఫస్ట్ సౌతిండియా సూపర్ హీరో మూవీ.. ఆ హీరో ఏమన్నాడంటే..

ABN, First Publish Date - 2021-12-24T16:12:05+05:30

మలయాళం యంగ్ హీరో టోవినో థామస్, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో నటించిన మూవీ ‘మిన్నల్ మురళీ’. సౌతిండియాలోనే మొదటి సూపర్ హీరో మూవీగా వస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలయాళం యంగ్ హీరో టోవినో థామస్, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో నటించిన మూవీ ‘మిన్నల్ మురళీ’. సౌతిండియాలోనే మొదటి సూపర్ హీరో మూవీగా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ తరుణంలో ఈ సినిమా సమయంలో తను ఎదుర్కొన్న అనుభవానలను పంచుకున్నాడీ యంగ్ హీరో.


టోవినో మాట్లాడుతూ.. ‘బడ్జెట్ పరంగా, పరిధి పరంగా ‘మిన్నల్ మురళీ’ నా కెరీర్‌లోనే భారీ చిత్రం. రెండు గంటలకు పైగా ఉన్న ఈ సూపర్ హీరో మూవీని నిర్మించడానికి మాకు 110 రోజులు పట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత బడ్జెట్ అవసరం అనేది. అందులో ఎంత కంటెంట్ ఉందనేద’ని తెలిపాడు.


ఈ సినిమాలో పాత్రను చేయడానికి ఆయన ఎదుర్కొన్న ఛాలెంజేస్ గురించి టోవినో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో కామన్ నుంచి సూపర్ హీరోగా మారేవరకు జర్నీని చూపించడానికి నాలుగు రకాలుగా ఉండే పాత్ర చేశాను.  పేపర్ ఉన్న కథని అలాగే తెరమీదకి తీసుకురాగలిగింది మా టీమ్. దానికి మేం ఎంతో అదృష్టం చేసుకున్నామ‌’ని చెప్పాడు.


కేరళలోని కురుక్కన్మోల్ ఓ సాధారణ పల్లెటూరులోని పని పాటలేని యువకుడిపై పిడుగు పడుతుంది. దీంతో పవర్స్ వచ్చి అతను సూపర్ హీరోగా మారగా ఎలాంటి సాహసాలు చేశాడనేది ఈ సినిమా కథ. సోఫియా పాల్ నిర్మించిన ఈ చిత్రం మలయాళంతో పాటు హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదలైంది.

Updated Date - 2021-12-24T16:12:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!