సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోన్న కోమల్‌

ABN, First Publish Date - 2021-12-12T02:05:34+05:30

హీరోయిన్‌ కోమల్‌ శర్మ ఇపుడు కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈమె రిలీజ్‌ చేసిన ప్రత్యేక ఫొటోలు చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. సీనియర్‌ దర్శకుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌కు ‘చట్టపడి కుట్రం’ అనే చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్‌ కోమల్‌ శర్మ ఇపుడు కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  తాజాగా ఈమె రిలీజ్‌ చేసిన ప్రత్యేక ఫొటోలు చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. సీనియర్‌ దర్శకుడు ఎస్‌.ఏ. చంద్రశేఖర్‌ తెరకెక్కించిన ‘చట్టపడి కుట్రం’ అనే చిత్రంలో కోమల్‌ శర్మ తొలిసారి నటించింది. ఆ తర్వాత ‘నాగరాజచోళన్‌ ఎంఏ, ఎమ్మెల్యే’, ‘వైగై ఎక్స్‌ప్రెస్‌’ తదితర చిత్రాల్లో నటించింది. ఒక్క కోలీవుడ్‌కే పరిమితం కాకుండా తెలుగు, హిందీ తదితర భాషల్లో అడుగుపెట్టిన ఈ భామ తాజాగా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన ‘మరైక్కాయర్‌’ చిత్రంలో నటించింది.. ఈ మూవీ ఇటీవలే విడుదలైంది. అంతేకాకుండా, ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం ‘హంగామా-2’తో పాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీ అవుతోంది.





Updated Date - 2021-12-12T02:05:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!