సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాప్సీ సినిమా ఓటీటీకేనా?

ABN, First Publish Date - 2021-06-02T04:00:12+05:30

మహిళా ప్రాధాన్యమున్న పాత్రలో మరోసారి తాప్సీ నటించిన ‘రష్మీ రాకెట్‌’ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందా.? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్ర్కూవాలా నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లలో విడుదల కానుందా లేదా ఓటీటీలో రానుందా అనే చర్చ కొన్నాళ్లగా జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళా ప్రాధాన్యమున్న పాత్రలో మరోసారి తాప్సీ నటించిన ‘రష్మీ రాకెట్‌’ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందా.? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించిన  ఈ చిత్రాన్ని రోనీ స్ర్కూవాలా నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లలో విడుదల కానుందా లేదా ఓటీటీలో రానుందా అనే చర్చ కొన్నాళ్లగా జరుగుతోంది. అయితే.. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని  బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇందులో గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఈ పాత్ర కోసం తాప్సీ చాలా కసరత్తులు చేశారు. దుబాయ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు తాప్సీ కేరాఫ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. భారత కికెటర్‌ మిథాలి రాజ్‌ బయోపిక్‌లోనూ ఆమె క్రికెటర్‌గా కనిపించనుంది. మరి కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 


Updated Date - 2021-06-02T04:00:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!