సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతితో ధనుష్..?

ABN, First Publish Date - 2021-09-10T16:14:08+05:30

'ఆర్ఎక్స్ 100' మూవీతో సూపర్ హిట్ అందుకొని టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతితో కోలీవుడ్ స్టార్ ధనుష్ మూవీ చేసేందుకు ఒకే చెప్పినట్టు వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'ఆర్ఎక్స్ 100' మూవీతో సూపర్ హిట్ అందుకొని టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతితో కోలీవుడ్ స్టార్ ధనుష్ మూవీ చేసేందుకు ఒకే చెప్పినట్టు వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ధనుష్ క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ స్ట్రైట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో పాన్ ఇండియన్ రేంజ్‌లో దీనిని తెరకెక్కించనున్నారు. అలాగే తమిళ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు ధనుష్. ఈ క్రమంలోనే అజయ్ భూపతితో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం అజయ్ భూపతి 'మహా సముద్రం' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శర్వానంద్ - సిద్దార్థ్ - అదితిరావు హైదరీ, అనూ ఇమ్మానియేల్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు, సాంగ్స్ భారీ అంచనాలను పెంచాయి. దీని తర్వాత ధనుష్‌కి కథ చెప్పబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-09-10T16:14:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!