సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆయన పాటలెప్పుడూ వెలుగు రేఖలే..

ABN, First Publish Date - 2021-01-29T05:09:19+05:30

ఆయన... పాటలు కొమ్మ కొమ్మకో సన్నాయి రాగాన్ని పాడిస్తాయి. రాలిపోయే పూవుతో ఆయన రాతలు రాగాలు తీయిస్తాయి. శ్రీ శ్రీ తర్వాత తెలుగు భాషకు అంతర్జాతీయ కీర్తి తీసుకొచ్చిన గొప్ప కవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయన... పాటలు కొమ్మ కొమ్మకో సన్నాయి రాగాన్ని పాడిస్తాయి. రాలిపోయే పూవుతో ఆయన రాతలు రాగాలు తీయిస్తాయి. శ్రీ శ్రీ తర్వాత తెలుగు భాషకు అంతర్జాతీయ కీర్తి తీసుకొచ్చిన గొప్ప కవి వేటూరి. ఆయన రాసిన పాటలు ఇప్పటికీ ఎప్పటికే తెలుగు చిత్రసీమలో మారు మోగుతూనే ఉంటాయి. జనవరి 29, వేటూరి జయంతి. వేటూరి పాట గడసరి పిల్లలా గంతులేస్తుంది.. సొగసరి జాణలా సిగ్గులు విరబూయిస్తుంది. ఆ పాటకు హద్దులుండవు.. ఆ మాటకు పరిధులుండవు.. మదిలో పలికిన భావాన్ని.. నిక్కచ్చిగా పలికించే సినీ కవి ఆయన. అది భక్తి గేయమైనా.. రక్తి గీతమైనా.. ఏదైనా వేటూరికి ఒకటే. ప్రాసలతో పాటలు అల్లినా.. యతులతో గతులు తప్పించినా.. వేటూరి కలానికే చెల్లింది.


సందర్భం.. పాత్రల స్వరూప స్వభావాల్ని అర్ధం చేసుకుని ప్రేక్షకుల మనసుకి దగ్గరగా పాట రాయడమనేది అంత ఆషామాషీ విషయమేం కాదు. అరుదైన ఆ విద్యలో వేటూరి ఆరితేరారు – పాటల కోటలో రారాజుగా వెలిగి పోయారు. వేల పాటల వేటూరి… జోల పాటలు మొదలుకుని అన్నిరకాల సాహితీ ప్రక్రియలను స్పృశించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వేటూరి పాటలెప్పుడూ వెలుగు రేఖలే ! పదే పదే మనసు దోచే పారిజాత మాలికలే!. 


తెలుగు భాషపై ఉన్న మమకారాన్ని, ప్రేమని పాటల రూపంలో చూపించి శ్రోతల మదిలో చెరగని ముద్ర వేసుకున్న పాటల రారాజు. వేటూరికి ముందు.. వేటూరికి తర్వాత అనే స్థాయికి తెలుగు పాటను తీసుకొచ్చిన నిరంతర పాటల శ్రామికుడు. వేటూరి పలుకు ఓ మంత్రాక్షరి, వేటూరి సాహిత్యంలో ఒకసారి తేనెల సోనలు కురిస్తే, ఒకచోట జానపదాలు విరబూస్తాయి. ఇంకోచోట విద్యుల్లతా ధ్వానాలు ప్రకటిస్తాయి. రమణీయ ప్రకృతిని కమనీయ పదాల్లో చూపించగల నేర్పరి వేటూరి. ఆయన భావంలో నుంచి పుట్టుకొచ్చిన గోదారి.. గలగలలు.. సరిగమల్లా వినిపిస్తాయి. అటువంటి వేటూరి ఆయన జయంతి సందర్భంగా ఒక్కసారి స్మరించుకుందాం.

Updated Date - 2021-01-29T05:09:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!