గుండెల్లో గిత్తలు కుమ్ముతున్నాయి
ABN, First Publish Date - 2021-11-23T05:41:04+05:30
అక్కినేని హీరోలిద్దరినీ ఒకేసారి వెండి తెరపై చూసుకోవడం కంటే ఆనందం ఏముంటుంది? ‘బంగార్రాజు’తో ఆ ముచ్చట మరోసారి చూసే అవకాశం దక్కుతోంది. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’...
అక్కినేని హీరోలిద్దరినీ ఒకేసారి వెండి తెరపై చూసుకోవడం కంటే ఆనందం ఏముంటుంది? ‘బంగార్రాజు’తో ఆ ముచ్చట మరోసారి చూసే అవకాశం దక్కుతోంది. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని చైతూ లుక్‌ని విడుదల చేశారు. వాసివాడి తస్సాదియ్యా... గుండెల్లో గిత్తలు కుమ్ముతున్నట్టు లేదూ..’ అంటూ చైతూ గెటప్ రివీల్ చేశారు. పూలచొక్కా, కళ్లజోడు, చేతికి బ్రాస్‌లెట్ తో.. దసరా బుల్లోడు గెటప్‌లో కనిపిస్తున్నాడు చైతూ. తనకు జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. ప్రస్తుతం మైసూర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల ఈ చిత్రంలోని ‘లడ్డుండ’ అనే పాటని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, చలపతిరావు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.