సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

డిఫరెంట్‌ స్ర్కీన్‌ప్లేతో...

ABN, First Publish Date - 2021-07-24T05:26:29+05:30

ఆదర్శ్‌, హరీశ్‌, ట్వింకిల్‌ అగర్వాల్‌, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ప్రధాన తారాగణంగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘తప్పించుకోలేరు’. సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు ప్రథమార్థంలో విడుదల....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదర్శ్‌, హరీశ్‌, ట్వింకిల్‌ అగర్వాల్‌, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ప్రధాన తారాగణంగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘తప్పించుకోలేరు’. సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన గ్యాస్‌ ఘటన స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమిది. డిఫరెంట్‌ స్ర్కీన్‌ప్లేతో రూపొందించాం. కొన్ని సన్నివేశాలను మధ్యప్రదేశ్‌లో చిత్రీకరించాం. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మాకు చక్కటి సహాయసహకారాలు అందించింది. వి.ఎ్‌స.పి. తెన్నేటిగారి మాటలు, పాటలతో పాటు రాజేశ్‌ రాజ్‌ సంగీతం చిత్రానికి ప్రధానాకర్షణలు. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని దర్శక-నిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్‌ (ఆర్‌.వి.జి) తెలిపారు. ఆయనతో కలిసి తలారి వినోద్‌కుమార్‌ ముదిరాజ్‌, శ్రీనివాస్‌ మామిడాల, లలిత్‌కుమార్‌ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - 2021-07-24T05:26:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!