సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తమిళ నటి చిత్ర కన్నుమూత

ABN, First Publish Date - 2021-08-22T16:38:39+05:30

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి చిత్ర (56) హఠాన్మరణం చెందారు. శనివారం వేకువజామున గుండెపోటు రావడంతో స్థానిక సాలిగ్రామంలోని ఆమె నివాసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి చిత్ర (56) హఠాన్మరణం చెందారు. శనివారం వేకువజామున గుండెపోటు రావడంతో స్థానిక సాలిగ్రామంలోని ఆమె నివాసంలోనే కన్నుమూశారు. ఈమెకు భర్త, ఒక కుమార్తె ఉన్నారు. నటిగానే కాకుండా పక్షుల ప్రేమికురాలిగా గుర్తింపు పొందిన చిత్ర మరణంపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 1980 దశకంలో మంచి నటిగా గుర్తింపు పొందిన చిత్ర.. ‘చేరన్‌ పాండ్యన్‌’ చిత్రంలో హీరో శరత్‌కుమార్‌ చెల్లిగా నటించారు. ఆ తర్వాత ఇటు సినిమాలు, అటు సీరియల్స్‌లలో నటిస్తూ ఎంతో బిజీ నటిగా మారారు. ఆ తర్వాత ‘నల్లణ్ణెయ్‌’ అనే సీరియల్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న చిత్ర... నల్లణ్ణైయ్‌ చిత్రగా ఫేమస్‌ అయ్యారు. ‘అప్పడిదాన్‌’ అనే చిత్రం ద్వారా బాలనటిగా కోలీవుడ్‌ దర్శక శిఖరం దివంగత కె.బాలచందర్‌ ద్వారా పరిచయమై ఆ తరువాత అనేక చిత్రాల్లో నటించారు. ఒక్క తమిళంలోనే కాకుండా, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆమె నటించారు. ఆమె అంత్యక్రియలు శనివారం నగరంలో జరిగాయి. ఈమె నటించిన చివరి చిత్రం ‘ఎన్‌ సంగత్తు ఆలు అడిచ్చవన్‌ ఎవండా’ గత ఏడాది జనవరిలో విడుదలైంది. 

Updated Date - 2021-08-22T16:38:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!