‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా’: శేఖర్ గ్లింప్స్
ABN, First Publish Date - 2021-11-25T23:51:06+05:30
రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న 91వ చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్‌రెడ్డి శివాని రాజశేఖర్, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు.
రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న 91వ చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్‌రెడ్డి శివాని రాజశేఖర్, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం గ్లింప్స్ విడుదల చేశారు. అరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవర్‌తో ఫస్ట్ గ్లింప్స్ మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకున్నా... ఇన్వెస్టిగేషన్ చేయరు. కొన్ని రోజుల క్రితం రిజైన్ చేసిన శేఖర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ‘శేఖర్’గా రాజశేఖర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేేసది మనకు చెప్పాడా?’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. గత చిత్రాలకు భిన్నంగా రాజశేఖర్ లుక్ ఉంది. జనవరిలో సినిమాను విడుదల చేస్తామని జీవిత తెలిపారు.