సర్వాయి పాపన్న బయోపిక్
ABN, First Publish Date - 2021-08-19T06:52:20+05:30
‘‘బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసి... 33 కోటలను జయించిన వీరుడు, సామాన్యుడు మహారాజు కావొచ్చని ఆనాడే చెప్పిన ధీరుడు సర్వాయి పాపన్న..
‘‘బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసి... 33 కోటలను జయించిన వీరుడు, సామాన్యుడు మహారాజు కావొచ్చని ఆనాడే చెప్పిన ధీరుడు సర్వాయి పాపన్న. రాజ్యాలను కొల్లగొట్టి సంపదను పేదలకు పంచారు. ఆయనకు గొప్ప చరిత్ర ఉందని, ఇంగ్లాండ్‌లో పెద్ద విగ్రహం పెట్టారు. ఆయనపై తీస్తున్న ఈ బయోపిక్ ఘన విజయం సాధించాలి’’ అని తెలంగాణ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వంశీ టైటిల్ పాత్రలో, ప్రతాని రామకృష్ణగౌడ్ దర్శకత్వంలో పల్లె లక్ష్మణరావు గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్ గోల్కొండ’. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా బుధవారం సినిమా టైటిల్ లోగోను శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ‘‘తెలుగు, కన్నడలో సినిమా చేస్తున్నాం. కర్ణాటక మాజీ సీయం బంగారప్ప కుమారుడు మధు ఇందులో భాగస్వామి’’ అని దర్శకుడు చెప్పారు. రూ. 50కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా తెరకెక్కిస్తున్నామని నిర్మాత తెలిపారు.