సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాప్సి కోసం సమంత

ABN, First Publish Date - 2021-11-02T08:36:29+05:30

కథానాయకుల్లో చాలామంది నిర్మాణ రంగం వైపు అడుగులు వేశారు. అగ్ర హీరోల విషయానికొస్తే దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు కథానాయికలూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథానాయకుల్లో చాలామంది నిర్మాణ రంగం వైపు అడుగులు వేశారు. అగ్ర హీరోల విషయానికొస్తే దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు కథానాయికలూ... నిర్మాత పాత్ర ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాప్సి సొంతంగా ఓ నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసింది. ‘అవుట్‌ సైడర్స్‌ ఫిలిమ్మ్స్‌’ పేరుతో సినిమాల్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా సమంతతో ఓ ప్రాజెక్టు చేయబోతోందని సమాచారం. ఇది నాయికా ప్రాధాన్యమున్న కథ అని, తాప్సి నిర్మాణానికే పరిమితం కాకుండా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీమెన్‌ 2’ తరవాత సమంతకు బాలీవుడ్‌ నుంచి అవకాశాలొస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ అధికారికంగా ఏదీ ఒప్పుకోలేదు. తాప్సి చిత్రంతోనే బాలీవుడ్‌ ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతోందని టాక్‌.


Updated Date - 2021-11-02T08:36:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!