సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మరోసారి ఆలోచించుకో అని చెప్పి చూశా.. విడాకుల వ్యవహారంపై Samanta తండ్రి Joseph Prabhu షాకింగ్ కామెంట్స్..

ABN, First Publish Date - 2021-10-05T19:33:16+05:30

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తామిద్దరం విడిపోతున్నట్టు చై-సామ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ విడాకులపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు సమంతను నిందిస్తుంటే.. మరికొందరు చైతన్యను విమర్శిస్తున్నారు. ఏదేమైనా వీరి విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. 


సామ్‌, చైలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతమని, దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని చైతన్య తండ్రి నాగార్జున ట్వీట్ చేశారు. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కూడా తన కూతురి విడాకుల గురించి స్పందించారు. తన కూతురు విడాకుల గురించి తెలియగానే తన మైండ్ బ్లాంక్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయం వినగానే ముందు తనకి ఏమీ తోచలేదని, కళ్ల ముందు చీకటి కమ్ముకున్నట్టు అయిందని అన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించుకోమని సమంతకు చెప్పి చూశానన్నారు. అయితే, తన కూతురు స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సద్దుమణిగుతాయని ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు. 

Updated Date - 2021-10-05T19:33:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!