సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మరో విభిన్న పాత్రలో రెబల్‌స్టార్‌

ABN, First Publish Date - 2021-12-21T05:58:22+05:30

ఐదు పదుల తన నట జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు తాజాగా ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో మరో వెరైటీ రోల్‌ చేస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు పదుల తన నట జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు తాజాగా ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో మరో వెరైటీ రోల్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారు. కాషాయ వస్ర్తాలు ధరించి, మెడలో, చేతిలో రుద్రాక్ష మాలలతో సాధువు గెటప్‌లో ఉన్న ఆయన  పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘పెదనాన్నగారితో కలసి మరోసారి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అంటూ ఈ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ప్రభాస్‌. సంక్రాంతి సందర్బంగా జనవరి 14న విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. రాధాకృష్ణ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మాతలు. 


Updated Date - 2021-12-21T05:58:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!