ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం!
ABN, First Publish Date - 2021-09-06T05:04:27+05:30
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రీకరణ పూర్తి చేసిన రామ్‌చరణ్, త్వరలో కొత్త చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ ఓ పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్న....
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రీకరణ పూర్తి చేసిన రామ్‌చరణ్, త్వరలో కొత్త చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ ఓ పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేశారట. హిందీ హీరో రణ్‌వీర్ సింగ్ సైతం హాజరుకావచ్చని సమాచారం. శంకర్‌తో ‘అపరిచితుడు’ను ఆయన హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌తో పాటు చిరంజీవి, పలువురు తెలుగు సినిమా ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో రామ్‌చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నారు. రామ్‌చరణ్‌కు ఇది 15వ సినిమా కాగా, ‘దిల్’ రాజుకు 50వ సినిమా. అందుకని, ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.