మా తొలి అడుగు
ABN, First Publish Date - 2021-10-09T07:00:27+05:30
‘మా బేనర్‌లో మంచి సినిమాలను ప్రేక్షకులను అందించడానికి మేం వేస్తున్న తొలి అడుగు ఈ సినిమా’ అని కోడి దివ్య దీప్తి అన్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి...
‘మా బేనర్‌లో మంచి సినిమాలను ప్రేక్షకులను అందించడానికి మేం వేస్తున్న తొలి అడుగు ఈ సినిమా’ అని కోడి దివ్య దీప్తి అన్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి, నరేష్ రెడ్డి ములెతో కలసి నిర్మిస్తున్న నూతన చిత్రం షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కోడి దివ్య ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై కార్తిక్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కిరణ్ అబ్బవరం, సంజన జంటగా నటిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కి నిర్మాత రామలింగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఏ.ఎం. రత్నం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎస్.వి. కృష్ణారెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్, అచ్చిరెడ్డి, మురళీమోహన్, రాజారవీంద్ర, కోటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.