సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇంతకు మించిన టైటిల్‌ దొరకలేదు

ABN, First Publish Date - 2021-11-09T06:56:24+05:30

‘నాయక్‌’, ‘అల్లుడు శీను’ తదితర చిత్రాలకు వి.వి.వినాయక్‌ దగ్గర సహాయకుడిగా పనిచేసిన శ్రీ సరిపల్లి. ఇప్పుడు ‘రాజా విక్రమార్క’తో దర్శకుడిగా మారారు. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నాయక్‌’, ‘అల్లుడు శీను’ తదితర చిత్రాలకు వి.వి.వినాయక్‌ దగ్గర సహాయకుడిగా పనిచేసిన శ్రీ సరిపల్లి. ఇప్పుడు ‘రాజా విక్రమార్క’తో దర్శకుడిగా మారారు. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈనెల  12న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ సరిపల్లి మాట్లాడుతూ ‘‘ఎన్‌.ఐ.ఏలో కొత్తగా చేరిన యువకుడి కథ ఇది. క్రమశిక్షణ లేకపోవడంతో పాటు, తన తొందరపాటు వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడో వినోదాత్మకంగా చూపిస్తున్నాం. యాక్షన్‌ ఎపిసోడ్స్‌కి ప్రాధాన్యం ఉంది. అయితే అవి చాలా సహజంగా, స్టైలీష్‌గా ఉంటాయి. ద్వితీయార్థం చాలా రేసీగా సాగుతుంది. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ చూశాక నా కథకు కార్తికేయ సరిపోతాడనిపించింది. తనకు కూడా కథ బాగా నచ్చడంతో పట్టాలెక్కించాం. ఈ సినిమా కోసం చాలా టైటిల్స్‌ అనుకున్నాం. కానీ ‘రాజా విక్రమార్క’ తప్ప వేరే ఏ టైటిల్‌ సరిపోదనిపించింది. చిరంజీవిగారి టైటిల్‌ వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేం ఆ పేరుని చెడగొట్టం. లాక్‌ డౌన్‌  సమయంలోనే రెండో సినిమాకి సంబంధించిన స్ర్కిప్టు కూడా సిద్ధం చేశా’’ అన్నారు. 


Updated Date - 2021-11-09T06:56:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!