సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నానీ వద్దన్నారు కానీ...

ABN, First Publish Date - 2021-08-23T09:18:02+05:30

‘రెండున్నరేళ్ల క్రితం ‘టక్‌ జగదీష్‌’ షూటింగ్‌ ప్రారంభించాం. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడింది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘రెండున్నరేళ్ల క్రితం ‘టక్‌ జగదీష్‌’ షూటింగ్‌ ప్రారంభించాం. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడింది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నాం. నానీ, చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ‘టక్‌ జగదీష్‌’ను థియేటర్‌లలోనే రిలీజ్‌ చేయమని కోరారు. కానీ మా ఇబ్బందులను వివరించి చెప్పటంతో ఓటీటీ విడుదలకు అంగీకరించారు. ్ఞ’’ అని ‘టక్‌ జగదీష్‌’ చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఓ ప్రకటనలో తెలిపారు. థియేటర్లలో సెప్టెంబర్‌ 10న విడుదలవుతున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రం నష్టపోకుండా ‘టక్‌ జగదీష్‌’ ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ కోరారు. ఈ నేపథ్యంలో ‘టక్‌ జగదీష్‌’ నిర్మాతలు ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రంలో నానీ హీరోగా, రీతూవర్మ, ఐశ్వర్యా రాజేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.


Updated Date - 2021-08-23T09:18:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!