సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

క్షమించండి: భీమ్లానాయక్‌ నిర్మాత

ABN, First Publish Date - 2021-12-22T00:09:27+05:30

‘‘నా చేతిలో ఏమీ లేదు.. క్షమించండి. నా హీరో పవన్‌కల్యాణ్‌గారి మాటను గౌరవించాను’’ అని అంటున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పవన్‌కల్యాణ్‌, రానా హీరోలుగా సాగర్‌.కె.చందర దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్‌’ చిత్రం ‘సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ పడుతుండడంతో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం పవన్‌కల్యాణ్‌, నిర్మాణ సంస్థ తమ సినిమా విడుదలను ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘నా చేతిలో ఏమీ లేదు.. క్షమించండి. నా హీరో పవన్‌కల్యాణ్‌గారి మాటను గౌరవించాను’’ అని అంటున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పవన్‌కల్యాణ్‌, రానా హీరోలుగా సాగర్‌.కె.చందర దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్‌’ చిత్రం ‘సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ పడుతుండడంతో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం పవన్‌కల్యాణ్‌, నిర్మాణ సంస్థ తమ సినిమా విడుదలను ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు. ఈ మేరకు రాజమౌళి కూడా అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. అయితే నిర్మాత నాగవంశీ ‘భీమ్లానాయక్‌’ విడుదల వాయిదా కారణంగా అభిమానులను క్షమాపణ కోరుతూ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘అభిమానులకు క్షమాపణలు. నా చేతిలో ఏమీ లేదు. మా హీరో పవన్‌కల్యాణ్‌గారి మాటలకు గౌరవించి సినిమాను వాయిదా వేశాం. ఎందుకంటే కల్యాణ్‌గారు ఇండస్ట్రీ మంచి కోసం ఆలోచించే వ్యక్తి. ఫిబ్రవరి 25న శివరాత్రికి ప్రేక్షకుల అందరినీ అలరిస్తాం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 




Updated Date - 2021-12-22T00:09:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!