వర్మ కామెంట్‌కు మనోజ్ ధీటైన ట్వీట్
ABN, First Publish Date - 2021-10-19T20:41:12+05:30
‘మా’ ఎన్నికలు ముగిసి పదిరోజులు కావొస్తున్నా ఏదో ఒక విమర్శ, వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీనితో సినిమా పరిశ్రమలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతలో కొంత సర్దుమణుగుతుంది అనుకునేలోపు వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రంగంలో దిగారు. రెండ్రోజుల క్రితం ‘మా’ ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది.
‘మా’ ఎన్నికలు ముగిసి పదిరోజులు కావొస్తున్నా ఏదో ఒక విమర్శ, వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీనితో సినిమా పరిశ్రమలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతలో కొంత సర్దుమణుగుతుంది అనుకునేలోపు వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రంగంలో దిగారు. రెండ్రోజుల క్రితం ‘మా’ ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. మంగళవారం ఆయన మరొక షాకింగ్ ట్వీట్ చేశారు. సిని‘మా’ ఓ సర్కస్ అని, అందులో ఉన్నవారంతా జోకర్లు’ అంటూ వర్మ చేసిన ట్వీట్‌కు మంచు మనోజ్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. ‘అందులో మీరు రింగ్ మాస్టర్ సర్’ అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారింది. మనోజ్ ట్వీట్‌కు వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.